Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఈ నెల 15న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అందుకు కారణాలు మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరగకపోయిన నష్టం లేదని ఆయన అన్నారు. టీం ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేంత బలంగా పాకిస్థాన్ జట్టు ఇప్పుడు లేదని ఆయన పేర్కొన్నారు. దానికి బదులుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో తలపడుంటే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

‘‘భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగకున్నా ఏం కాదు. చాలా కాలంగా భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడం లేదు. పూర్తి ఫలితాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. కారణం.. పాక్ 90 దశకంలో ఉన్నట్లు ఇప్పుడు బలంగా లేదు. ఇప్పుడు టీం చాలా బలహీనంగా ఉంది. అసలు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. భారత్ ఆ టీమ్‌తో తలపడుతుంటే.. ఏదో చిన్న జట్టుతో తలపడినట్లు ఉంటోంది’’ అని తెలిపారు.