
జొహెన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు విజయంతో సిరీస్‌ని ముగించింది. మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా వాండరర్స్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో డక్‌వర్త్ లుయీస్ విధానంలో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిది. ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ 10 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. ఆ తర్వాత డిఆర్‌ఎస్ ప్రకారం సౌతాఫ్రికాకు 10 ఓవర్లలో 125 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. కానీ, ఈ లక్ష్య చేధనలో సఫారీ జట్టు విఫలమైంది. 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయడంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో గెలిచింది. అయినప్పటికీ.. సిరీస్‌ని 1-2 తేడాతో కోల్పోయింది.