
మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్ర డిప్యూటీ సిఎంఅజిత్ పవార్ మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సంతాపం తెలిపారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బారామతిలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని, ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి కోరారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని, అజిత్ పవార్ మృతిపట్ల సంతాపాన్ని ఆయన ప్రకటించారు.
కాగా, అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దేశ రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. ఆయన మృతదేహాన్ని తరలించిన ఆస్పత్రి వద్ద భారీ ఎత్తున పార్టీ నేతలు, ప్రజలు చేరుకొని కంటతడి పెట్టుకున్నారు.