Reading Time: < 1 minute

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అన్నంపల్లి పంచాయతీ లక్ష్మిదేవిలంక గ్రామానికి చెందిన విద్యార్థి సోంపల్లి వెంకట రవీంద్ర.. అమలాపురం నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు రోజూలాగే ఆర్టిసి పల్లె వెలుగు బస్సు ఎక్కాడు. తోటి విద్యార్థులతో కలిసి వెనుక సీట్లో కూర్చుని కిటీకి నుంచి తల బయటకు పెట్టడంతో టోల్‌ప్లాజా గడ్డరు తగిలి మరణించాడు. ఊహించని పరిణామంతో తోటి విద్యార్థులంతా షాక్‌కి గురయ్యారు.