
వాహనాల ట్రాఫిక్ చాలాన్ల రుసుంను సదరు వ్యక్తుల బ్యాంకు అకౌంట్ల నుంచి నేరుగా విత్-డ్రా అయ్యేలా యాప్ రూపొందించడం పట్ల బిజెపి అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బ్యాంకు ఖాతాలు వారి వ్యక్తిగతమైనవని, బహిరంగ పరచరాదని అన్నారు. ఈ విధానం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికపరమైన మోసాలను అరికట్టేందుకు కేంద్రం రూపొందించిన సంచార్ సాతీని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు.డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తుల వీడియోలు తీయడంలో తప్పులేదు కానీ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా అనర్థాలు జరుగుతున్నాయని ఆయన ఇటీవల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఉదహరించారు. డ్రంకెన్ డ్రైవ్‌ను తాను తప్పు పట్టడం లేదన్నారు..