Reading Time: < 1 minute
Https Www Ntvtelugu Com Telangana Kaushik Reddy Remarks On Medigadda Barrage Sparks Row Kr Nagaraju Reacts

Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్లు.. నా నియోజక వర్గంలోని తనుగుల చెక్ డ్యామ్ను కూడా బాంబు పెట్టీ పేల్చారని ఆరోపించారు.

Read Also: Ernakulam Express Fire Accident: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కీలక ఆధారాలు సేకరించిన FSL బృందాలు

అయితే, సభలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు.. బాంబులు పెట్టీ పేల్చారు అనడం ఏంటి అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి వెంటనే తొలగించాలి అని కోరారు.