Reading Time: < 1 minute
UGC NET 2025 Admit Card: యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. మరో 2 రోజుల్లోనే పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 29: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) డిసెంబర్ 2025 సెషన్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులు వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ 2025 పరీక్షలు డిసెంబర్ 31వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఆయా పరీక్షలకు 4 రోజులు ముందుగా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో డిసెంబర్‌ 31 వ తేదీన జరిగే పరీక్షలకు సంబంధించి అభ్యర్ధులు తమ అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూజీసీ నెట్‌-2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా ఇటీవల నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. సబ్జెక్టు వారీగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌లో పరీక్షల తేదీలను ఎన్టీయే ప్రకటించినప్పటికీ సబ్జెక్టుల ప్రకారం పరీక్ష తేదీలను వెల్లడించింది. ఎన్టీయే తాజా షెడ్యూల్‌ ప్రకారం.. యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2025 పరీక్షలు డిసెంబర్‌ 31 నుంచి జనవరి 7 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల ప్రకారంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. షిఫ్ట్‌ 1 పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, షిఫ్ట్‌ 2 పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగన్నాయి. కాగా కాగా ఏటా ఈ పరీక్షను ఎన్టీయే రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యూజీసీ నెట్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డుతోపాటు యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. వీటితోపాటు పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.