Reading Time: < 1 minute

టెహ్రాన్: డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అల్టీమేటంకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. తాము ఏమాత్రం వెనుకాడబోమని, దాడులను రెట్టింపు చేస్తామని పేర్కొంది. ట్రంప్ తాజా బెదిరింపుల నేపథ్యంలో అన్ని దౌత్య మార్గాలు, పరోక్ష చర్చలు నిలిపివేశామని కూడా ఇరాన్ తెలిపింది. హార్మూజ్‌ తరహాలో బాబ్‌ ఎల్‌ మండేబ్‌ జలసంధిని కూడా మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

“అమెరికా ఉగ్రవాద సైన్యం హద్దులు దాటితే, మా ప్రతిస్పందన ఈ ప్రాంతానికి ఆవల ఉంటుంది. మేము పౌరయేతర లక్ష్యాలపై దాడులు ప్రారంభించలేదు, ప్రారంభించబోము. అయితే, పౌర సౌకర్యాలపై జరిగే నీచమైన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి మేము వెనుకాడబోము” అని ఇరాన్ ఉన్నత దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) తెలిపింది.