Reading Time: < 1 minute

హార్ముజ్ గుండా మరో రెండు భారత్ నౌకలు… ఓడల భద్రతకు నౌకాదళం సహాయం

Caption of Image.
  • గల్ఫ్ లో 20 భారతీయ జెండా నౌకలు పనిచేస్తున్నాయి
  • జలమంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ సిన్హా

టెహ్రాన్: హార్మూజ్ జలసంధి ద్వారా మరో రెండు వాణిజ్య నౌకలు భారత్కు చేరుకొను న్నాయి. ఈ నౌకల భద్రతను నిర్ధారించడా నికి భారత నౌకాదళం పూర్తి అప్రమత్తతతో పని చేస్తోందని జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు వెల్లడించారు. 

గల్ఫ్ ప్రాంతంలో గత 24 గంటల్లో భారతీయ నౌకలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచే సుకోలేదన్నారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ లో సుమారు 20 భారత జెండా నౌకలు పని చేస్తున్నాయన్నారు. వీటిలో దాదాపు 540 మంది భారతీయులు ఉన్నారు. వీరందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

►ALSO READ | LPG ఇంకా ఇంటికి చేరలేదా..? రేషన్లో కిరోసిన్ ఇస్తున్నారు.. ఒక్కో ఫ్యామిలీకి మూడు లీటర్లు..!

కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ప్రతి రోజు కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. గత 24 గంటల్లో ఈ కేంద్రానికి 98 కాల్స్, 335 ఇమెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు. వాటికి వెంటనే రిప్లే ఇచ్చాం. దీనిపై ప్రభుత్వం, సంబంధిత ఏజెన్సీలు సక్రమంగా, ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.