
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఘట్టం ఆసన్నమైంది. ఆయన నటిస్తున్న 100వ చిత్రం షూటింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్?
ఈ సినిమాలో నాగార్జున సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే లేటెస్ట్ గా నటి ఐశ్వర్య రాజేష్‌ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు ముగిశాయని, త్వరలోనే ఆమె సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది. తెలుగు మూలాలు ఉండి, తమిళంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఐశ్వర్య రాజేష్.. గ్లామర్ కంటే అభినయానికే పెద్దపీట వేస్తారు. గతేడాది వెంకటేష్ సరసన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంలో తన సహజ నటనతో మెప్పించిన ఈమె, ఇప్పుడు నాగ్ సరసన నటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
టబుతో క్రేజీ రీ-యూనియన్!
ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఏమిటంటే.. సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. నాగార్జున-టబు కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’ వంటి చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. దాదాపు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం సినిమాపై క్రేజ్‌ను డబుల్ చేస్తోంది. దర్శకుడు రా.కార్తీక్ ఈ వందో చిత్రాన్ని ఒక యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా మలుస్తున్నట్లు సమాచారం. భావోద్వేగాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది..
ALSO READ : అన్‌ఫాలోతో అగ్ని రాజేసిన రిషబ్ శెట్టి
అన్నపూర్ణ స్టూడియోస్ మార్క్
నాగార్జున కెరీర్‌లో వందో సినిమా కావడంతో, సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తోంది. రా.కార్తీక్ ఇదివరకు ‘నిన్నం మరప్పతిల్లై’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన విజన్‌కు నాగ్ స్టార్ పవర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.