Reading Time: < 1 minute

మహబూబాబాద్ మిషన్ భగీరథ ఆఫీసుకు వాటర్ బంద్..వారం రోజులుగా ఉద్యోగుల తిప్పలు …

Caption of Image.

మిషన్ భగీరథ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలంగాణలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించడం కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ పథకం. ఈ పథకం ద్వారా చాలా గ్రామాలకు సురక్షిత తాగునీరు అందింది. అయితే.. మహబూబాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ ఆఫీసు నీటి కష్టాల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గత వారం రోజులుగా నీటి సరఫరా బంద్ అవ్వడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

ఆఫీసులో వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు మిషన్ భగీరథ ఉద్యోగులు. బాత్ రూమ్ లలో కూడా వాటర్ లేక దుర్వాసన వస్తోందని.. తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. బయటి నుంచే వాటర్ కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ఉద్యోగులు.

మంచి నీళ్ళ ఆఫీసుకే నీటి సరఫరా బంద్ అవ్వడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా నీటి సరఫరా లేక ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. 

ఆఫీసు ఆవరణలో ఉన్న బోరు కూడా పని చేయట్లేదని అంటున్నారు.జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే మిషన్ భగీరథ ఆఫీసు నీటి సరఫరా పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.

©️ VIL Media Pvt Ltd.