Reading Time: < 1 minute

కోల్ బెల్ట్ లో ఆలయాలకు కొత్త రూపు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

Caption of Image.

గోదావరిఖని, వెలుగు: కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెల్ట్​ఏరియాలోని ఆలయాలకు కొత్త రూపు తీసుకువస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. గోదావరిఖని కోదండ రామాలయం ఆవరణలో శుక్రవారం సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. మేయర్​ మహంకాళి స్వామితో కలిసి సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాలయం ఆవరణలో రూ.2 కోట్లతో కల్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రామగుండం టర్నింగ్​ సమీపంలో హనుమాన్​ జంక్షన్​ వద్ద భారీ ఆంజనేయస్వామి విగ్రహం, మున్సిపల్​ ఆఫీస్​ సమీపంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి జీఎం డి.లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, జాతీయ ఎస్సీ కమిషన్​మెంబర్​ వడ్డేపల్లి రాంచందర్​, ఆలయ కమిటీ చైర్మన్​ గట్ల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.