
హైదరాబాద్ సిటీ, వెలుగు: నేడు ఎర్త్ అవర్- 2026ను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ నగర ప్రజలకు కీలక పిలుపునిచ్చింది. శనివారం రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆపివేసి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరింది. గివ్ అన్ హవర్ ఫర్ ఎర్త్ అనే నినాదంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.