
రియాద్: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్, గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది.సౌదీ అరేబియాలోని అమెరికాకు చెందిన సైనిక స్థావరంపై శుక్రవారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో దాదాపు 10 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన దాడిలో తమ సైనికులు గాయపడ్డారని.. పలు అమెరికా ఇంధన సరఫరా విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
కాగా, ఇరాన్‌ను “తుడిచిపెట్టేశామని” అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్ దాడులు చేసింది. క్షిపణితో పాటు మానవరహిత డ్రోన్‌లను ఉపయోగించి ఇరాన్ ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి భీకర దాడులు జరిగే అవకాశం ఉంది.