Reading Time: < 1 minute

మోదీ దూరదృష్టితోనే  ఇంధన ధరలు కంట్రోల్..డీజిల్, పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు హర్షనీయం

Caption of Image.
  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: పశ్చిమాసియా ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడుతున్నప్పటికీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టారని చెప్పారు. ఇరాన్ వంటి దేశాలతో ఉన్న సత్సంబంధాలు కూడా ఇందుకు దోహదపడ్డాయని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో పెట్రోల్‌‌పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించారని పేర్కొన్నారు. అలాగే డీజిల్‌‌పై లీటరుకు రూ.10గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించారని తెలిపారు. సామాన్య ప్రజల ప్రయోజనాలకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈ నిర్ణయాలు మరోసారి స్పష్టం చేశాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.