Reading Time: < 1 minute

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శుక్రవారం తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు వైభవ్. ఆ తర్వాత అండర్-19 జట్టులో చేరి అద్భుతాలు సృష్టించాడు. అయితే ఈ 15వ పుట్టిన రోజుతో వైభవ్‌కి ఉన్న ఏకైక అడ్డంకి తొలగిపోయింది. అండర్‌-19లో రాణించిన వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని ఎన్నో డిమాండ్లు వచ్చాయి. అయితే వైభవ్ వయస్సు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఎందుకుంటే జాతీయ జట్టులో అవకాశం రావాలంటే 15 ఏళ్ల వయో పరిమితి ఉంది. ఇప్పుడు వైభవ్ ఆ వయస్సుకు రావడంతో అతడికి ఉన్న అడ్డంకి తొలగిపోయినట్లైంది. దీంతో త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది.