Reading Time: < 1 minute

ఎపిలోని తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసుల కాల్పులు జరిపారు. ఘట నకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్తి కోసం అత్తమామల మీద కోపంతో ఐదేళ్ల బావమరిదిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంత పురం జిల్లాలో బాలుడి హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో ఐదేళ్ల బావ మరిది హేమచంద్రను బావ సర్వేశ్‌కుమార్ కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలికి వెళ్లిన సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడి బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు. అతడికి గాయాలు కాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సిఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ చేతికి గాయాలవడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స అందించారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది.