
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ శనివారం ప్రారంభం కానుంది. వరల్డ్ ప్రారంభానికి రెండు రోజులు ఉండడంతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఆల్ రౌండర్ హర్షిత్ రాణా గాయపడడం అనేది టీమిండియాను కలవరపాటు గురి చేస్తోంది. బుధవారం దక్షిణాఫ్రికాతో టీమిండియా వార్మఫ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో సఫారీలపై టీమిండియా గెలిచింది. హర్షిత్ ఒక ఓవర్ బౌలింగ్ లో 16 పరుగులు ఇచ్చాడు. అనంతరం అతడు మైదానం నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇబ్బందిగా నడస్తున్నట్టు అనిపించింది. మోకాలు పట్టుకొని నడవడంతో అతడు గాయపడినట్టు తెలుస్తోంది. బౌలింగ్ చేసే సమయంలో రెండు సార్లు రన్‌అప్ చేసి ఆపేశాడు. అతడు పక్కగా గాయపడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షిత్ గాయపడితే టీమిండియాకు తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడిప్పుడే తిలక్ వర్మ, అక్షర పటేల్ గాయాల నుంచి కొలుకొని జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా గాయంపై ఇప్పటివరకు బిసిసిఐ ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు.