
హైదరాబాద్: శరీరం చెప్పే మాట అందరూ వినడంతో పాటు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్య ఉండకూడదని నటుడు చిరంజీవి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరు ప్రసంగించారు. శరీరంలో వచ్చే మార్పులు గమనించడంతో క్యాన్సర్ ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే ఆ వ్యాధిని జయించగలుగుతామని తెలిపారు. అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్‌లు వేయిస్తే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటామన్నారు. మహిళలు జాగ్రత్తంగా ఉండడంతో పాటు వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని సూచించారు. జీవనశైలిలోఏ మార్పులు చోటుచేసుకోవడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు. వంశపారపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, క్యాన్సర్‌పై అవగాహన కోసం తాను షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి సిద్ధంగా ఉన్నానని చిరు తెలిపారు. తన స్నేహితుడు క్యాన్సర్ సోకిన వెంటనే గమనించి వైద్యం తీసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, పదేళ్ల నుంచి హాయిగా ఉన్నాడని చిరు వివరించారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.