
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లమ్మబండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు హత్య చేసి ముక్కలుగా చేసి మద్యం దుకాణం వెనుక చెత్తకుప్పలో మృతదేహాన్ని పడేసారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చి సమీపంలో గోన సంచిలో మనిషి కాళ్లు చూసి చెత్త ఏరుకునే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా, గోన సంచిలో నడుము నుండి కాళ్ల వరకు మాత్రమే ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. మిగతా మృతదేహం గురించి వెతికినా దొరకకపోవడంతో, కేసు నమోదు చేసి, మృతుడి వివరాల కోసం దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.