Reading Time: < 1 minute

తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్. బ్లాక్ స్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డైరెక్టర్ బాహుబలి పళని మాట్లాడుతూ “ఈ సినిమాలో హీరో వెంకటేష్ తన ఫైట్స్, నటనతో ఆకట్టుకున్నాడు. అతను కన్నడలో యాక్షన్ సినిమా చేశాడు. తెలుగులో వెంకటేష్‌కు మంచి అవకాశాలు వస్తాయి. మా ప్రొడ్యూసర్స్ రంజన, రోహిత్ ముంబయ్ నుంచి సినిమా మీద ప్యాషన్‌తో టాలీవుడ్‌కు వచ్చారు. హీరోయిన్లు ప్రమోషన్‌కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్, హీరో వెంకటేష్ పెద్దపాలెం పాల్గొన్నారు.