
మన తెలంగాణ/హైదరాబాద్ : సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యక ర్త శశిధర్ గౌడ్ (నల్లబాలు)పై రాష్ట్ర హైకో ర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సి ఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీ డియాలో బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కా ర్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు సదరు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు సూచించింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలం గాణ ప్రభుత్వ తరఫు న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా గతంలో ప్రస్తావించారు. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీం న్యాయస్థానం. హైకోర్టు తీర్పు ను అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీలేదని స్పష్టం చేసింది.