Reading Time: 2 minutes

న్యూఢిల్లీ : లోక్‌సభలో సోమవారం కేంద్రం, ప్రతిప క్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో వాగ్యు ద్ధం సాగింది. 2020 భారత్ చైనా ఘర్షణ నేపథ్యం తో సైనిక మాజీ ప్రధానాధికారి ఎంఎం నవరానే రాసి న జ్ఞాపకాల పుస్తకం’లోని అంశాలను రాహుల్ గాం ధీ సభలో ప్రస్తావించడం వివాదానాకి దారితీసింది. ఘర్షణ దశలో చైనా సేన లు భారత్‌లోకి ప్రవేశించాయని మాజీ ఆర్మీచీఫ్ ఈ పుస్తకంలో పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వెలువడిన వార్తను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి ఎం పిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని నిర్థారణ కాని అంశాల ను రా హుల్ ప్రస్తావించం అనుచితం అని ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ సింగ్ రాహుల్‌పై ఎదురుదాడికి ది గారు. ఆయన సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్ పదే పదే సభను అవమానించేలా వ్యవహరిస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని సూ చించారు.

ఈ దశలోనే స్పీకర్ కలుగచేసుకుని వార్తా పత్రికల క్లిప్పింగ్‌లు, అప్రచురిత పు స్తకాల్లోని అంశా లు సభలో ప్రస్తావించకూడదని మందలించారు బిజె పి సభ్యులు రాజ్‌నాథ్‌కు, అమిత్ షాకు మద్ద తు పలికారు. దీనితో సభలో వాడివేడి వాతావర ణం నెలకొంది. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్ర స్తావించకుండా స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. అయితే రాహుల్ వెనకకు తగ్గలే దు. ఆయనకు తోడుగా పలువురు ప్రతిపక్ష ఎంపిలు నిలిచారు. దీనితో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ ముందుగా రెండుసార్లు వాయిదా పడింది. తరువాత అధికార , విపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనల నడుమనే స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాహుల్ గాంధీ ముందుగా మాట్లాడారు. ఈ సందర్భంగా అంతకు ముందు మాట్లాడిన బిజెపి ఎంపి తేజస్వీ సూర్య కాంగ్రెస్‌కు జాతీయవాదం లేదని చేసిన విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగానే జనరల్ నవరానే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించారు. చైనా మన భూభాగం కబ్జా చేస్తూ పోతూ ఉంటే నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్న వారు జాతీయవాదులు అన్పించుకుంటారా? అని బిజెపిని నిలదీశారు. దీనితో వివాదం రాజుకుంది. పుస్తక ప్రస్తావనపై రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. దేశ సమగ్రత విషయంపై మాట్లాడకూడదనే విషయం ప్రతిపక్ష నేత తెలుసుకుంటే మంచిదని చురకలకు దిగారు. అయితే పుస్తకంలోని అంశం , ఇందులో పొందుపర్చిన డాక్యుమెంట్ నిర్థారితం అని , దీనిని ప్రస్తావించడంలో తప్పేమీ లేదని తెలిపారు. అయితే తప్పుడు అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. ఇది సభను పక్కదోవ పట్టించడమే అవుతుందని అధికార సభ్యులు రాహుల్‌ను దిగ్బంధం చేసేందుకు యత్నించారు. చైనాపై తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న పలు నిర్ణయాలు, ఆయన వల్ల వేలాది ఎకరాల భూమి చైనా ధారాదత్తం అయిన రికార్డులు ఉన్నాయని, వీటిని సభలో ప్రస్తావించలేమని తెలిపారు. అయితే తాను ఈ అంశాన్ని ప్రస్తావించదల్చుకోలేదని, కానీ బిజెపి ఎంపి సభలో కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ మాట్లాడటం వల్లనే తాను ఈ విషయం చెప్పాల్సి వచ్చిందని అన్నారు. రాహుల్‌కు సమాజ్‌వాది పార్టీ, టిఎంసి,ఆర్జేడీ ఇతర పార్టీల సభ్యులు మద్దతుగా లేచి నిలబడ్డారు. సభలో పరస్పర విమర్శల జోరు కొనసాగింది. దీనితో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ పక్క దారి పట్టింది.

మోడీ అసమర్థతకు దడికట్టే యత్నం: రాహుల్

చైనా దురాక్రమణను మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లు అడ్డుకోలేకపొయ్యారు. ఈ విషయాన్ని తెలిపింది ఏకంగా ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవానే. ఆయన పుస్తకం ప్రచురితం కాకుండా కేంద్రం అడ్డుకుంది. పుస్తకంలోని అంశాలు పత్రికల్లో వస్తే, వాటిని తాను లోక్‌సభలో ప్రస్తావిస్తే తప్పేమిటని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. లోక్‌సభ వాయిదా తరువాత ఆయన పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఆర్మీలో బాధ్యతాయుత స్థానపు వ్యక్తి ప్రస్తావనలతో ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే వీటిని ప్రస్తావించకుండా తనను మోడీ తమ వారితో అడ్డుకునేలా చేశారని రాహుల్ విమర్శించారు. నరవానే జీ తమ పుస్తకంలో రక్షణ మంత్రి గురించి స్పష్టంగా రాశారని తెలిపారు. చైనా మన భూమి ఆక్రమిస్తూ ఉంటే 56 అంగుళాల ఛాతీ వాలా ఏం చేస్తున్నారని రాహుల్ ఈ దశలో మోడీపై విరుచుకుపడ్డారు.