Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్:మున్సిపల్ ఎన్నిక ల్లో అన్ని సర్వేలూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉ న్నాయ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అ మెరికా నుంచి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల జూమ్ మీ టింగ్‌లో పాల్గొన్నా రు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమా ర్క, మంత్రులు కూడా జూమ్‌లో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? అని ము ఖ్యమంత్రి ఈ మీటింగ్‌లో ప్రశ్నించారు. పిసిసి అ ధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ స్పంది స్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతూ స్క్రీనిం గ్ కమి టీ సిఫార్సు చేసిన జాబితా గురించి తెలిపారు.

స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు మేరకు అభ్యర్థులకు బి-ఫా రం ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఇంకా పార్టీ ప్రచారం, ప్రజలకు ఇ వ్వాల్సిన హామీల గురించి కూడా చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై తాను వేర్వేరు నివేదికలు తెప్పించుకున్నానని, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి సమీపాన ఉన్న క్యాంపు కార్యాలయంలో ము న్సిపల్ ఎన్నికలపై సన్నాహక కమిటీ సమావేశం లో పాల్గొంటారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీ గా ఇదివరకే నియమించిన ఇన్‌ఛార్జి మంత్రులతో సమావేశం కానున్నారు. మీనాక్షి నటరాజన్, పిసి సి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు.