Reading Time: < 1 minute

విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి… సూర్యతో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ‘ఫార్చ్యూన్ ఫోర్’ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఈ చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పేరు వినగానే త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో సూర్య ఒక నడి వయస్కుడిగా కనిపిస్తారని, కేరళ బ్యూటీ మమిత బైజు ఇందులో కథానాయికగా నటిస్తోందని సమాచారం. వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ చాలా ఆసక్తికరంగా, వైవిధ్యంగా ఉండబోతోందని సినీ వర్గాల టాక్. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు, ఈ ఫ్యామిలీ డ్రామా మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సూర్య చేతిలో ‘కరుప్పు’ వంటి యాక్షన్ సినిమాలు ఉన్నప్పటికీ, వెంకీ అట్లూరి స్టైల్ లో రాబోతున్న ఈ సినిమాపైనే ట్రేడ్ వర్గాల్లో ఎక్కువ ఆశలు ఉన్నాయి. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ ‘విశ్వనాథం అండ్ సన్స్’ టైటిల్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.