Reading Time: 2 minutes

వెనిజులాపై అమెరికా దాడి అసలు కారణం ఇదేనా?..కమలా హారీస్ చెబుతుంది నిజమేనా!

Caption of Image.

వెనిజులాపై  అమెరికా అధ్యక్షుడు దండెత్తిన విషయం తెలిసిందే.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో, అతని భార్యను బందీలుగా అమెరికాకు తీసుకెళ్లి నార్కో టెర్రరిజం ఆరోపణలతో న్యూయార్క్ కోర్టు బోనులో నిలబెట్టనున్నారు. మదురో  దశాబ్దాలుగా, డ్రగ్స్ అక్రమ రవాణా, చట్టవిరుద్ధ పనులు చేసేందుకు అధికారాన్ని వినియోగించుకుంటున్నాడని అభియోగాలు మోపారు.టన్నుల కొద్దీ కొకైన్‌ను ఉత్పతి, రవాణా వంటి నార్కో ఉగ్రకార్యకలాపాలతో జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఇదంతా బయటికి తెలిసిన విషయం. అయితే అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మాత్రం దీని వెనక అసలు కథ వేరే ఉంది అని అంటోంది. ముదురో, అతని భార్య అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ ట్వీట్ చేసింది.. 

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ అరెస్ట్‌, ఆ తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలను యూఎస్‌ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ చర్యలు డ్రగ్స్‌ లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, పూర్తిగా ఆయిల్‌ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం X  ద్వారా స్పందించిన కమలా హారిస్‌..ట్రంప్‌ చర్యలు అమెరికాకు అంత  సురక్షితం కాదని అన్నారు.  ట్రంప్ చర్యలతో  అమెరికన్ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. 

మరోవైపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో , అతని భార్యను బందీలుగా అమెరికాకు తరలించిన ట్రంప్.. నార్కో-టెర్రరిజం ఆరోపణలపై న్యూయార్క్ కోర్టులో వారిని విచారించనున్నారు. అమెరికా దాఖలు చేసిన అభియోగ పత్రంలో మదురో  దశాబ్దాలుగా, డ్రగ్స్ అక్రమ రవాణా, చట్టవిరుద్ధ పనులు చేసేందుకు అధికారాన్ని వినియోగించుకుంటున్నాడని అభియోగాలు మోపారు.టన్నుల కొద్దీ కొకైన్‌ను ఉత్పతి, రవాణా వంటి నార్కో ఉగ్రకార్యకలాపాలతో జేబులు నింపుకున్నారని అభియోగాలు మోపారు. 

ఇదిలా ఉంటే.. ముదురో, అతని భార్య అరెస్ట్ ను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోపిస్తున్నట్లు ముదురో డ్రగ్స్ అధిపతి మదురో కావచ్చు లేదా కాకపోవచ్చు.. మదురో అమెరికాపై సైనిక దాడికి ప్రణాళిక వేస్తున్నాడని అభియోగపత్రం లో లేదు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. ఒక దేశం మరొక దేశంపై దాడి చేయగల ఏకైక ఆధారం ఆత్మరక్షణ.  ఒక దేశ ప్రభుత్వం లేదా నాయకుడి వైఫల్యాలు ఏమైనప్పటికీ పాలన మార్పు కోసం మరొక దేశంపై దాడి చేయడం అంతర్జాతీయ చార్టర్‌ను ఉల్లంఘించడమే అని విమర్శించింది. 

చమురు కోసమేనా దాడి?

వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉందని నమ్ముతారు.  ఆ దేశం చమురు నిల్వలు 300 బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండవచ్చని అంచనా.. వెనిజులా ముడి చమురు నిల్వలు ప్రపంచంలోని మొత్తంలో 17శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఉత్పత్తి సామర్థ్యంలో వెనిజులా వెనకబడి ఉంది. 1999లో అప్పటి వెనిజులా అధ్యక్షుడు హ్యుగో చావెజ్ హయాంలో రోజుకు 3.5 మిలియన్  బ్యారెళ్ల  చమురు ఉత్పత్తి  చేసింది. ఆ టైం లో ప్రపంచంలో టాప్ 10 ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా నిలిచింది. 

ప్రస్తుతం వెనిజులా చమురు ఉత్పత్రి బాగా తగ్గింది. రోజుకు 1మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి  అవుతోంది.. నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, పెట్టుబడి లేమి, అవినీతి దేశ చమురు పరిశ్రమను ,ఆ దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేశాయి. 

వెనిజులా రాజధాని కారకస్ పై దాడి.. ఆదేశ నాయకుడిని బందీగా తీసుకున్న తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు..కేవలం చమురు కోసమే వెనిజులాపై దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. అమెరికాలోని అతిపెద్ద చమురు కంపెనీల సాయంతో వెనిజులా చమురు పరిశ్రను అభివృద్ది చేస్తామని  ట్రంప్ హామీ ఇవ్వడం క్లియర్ గా చమురుకోసమే వెనిజులా పై దాడి చేసినట్లు కనిపిస్తోంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. నార్కో టెర్రరిజం పేరుతో ట్రంప్ వెనిజులాపై దాడిని ఆత్మరక్షణ చర్యగా చెప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 

©️ VIL Media Pvt Ltd.