
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన చిలుకూరి రాజ్‌కుమార్(21) గోదావరిలో గల్లంతయ్యాడు. మండలంలోని పొదుమూరు గ్రామం సమీపంలో గోదావరి నది ఒడ్డున రాజ్‌కుమార్‌కు చెందిన బ్యాగ్, చెప్పులు కనిపించడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈతగాళ్ల సాయంతో గోదావరి నదిలో గాలింపు చేపట్టారు.
రాజ్‌కుమార్ తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రాజ్‌కుమార్ కూడా తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లోనే ఉండి కర్మన్‌ఘాట్‌లోని అమృతా కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. ఇటీవల తల్లిదండ్రులు మందలించడంతో స్వగ్రామమైన బుచ్చంపేటకు వచ్చాడు.
ఈ క్రమంలో పొదుమూరు గ్రామం సమీపంలోని గోదావరి నది ఒడ్డున అతని బ్యాగ్, చెప్పులు కనిపించడంతో గోదావరిలో గల్లంతయ్యాడేమోనన్న అనుమానంతో బంధువులు గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే గోదావరిలో ఎంత వెతికినా ఇప్పటివరకు అతని జాడ లభించలేద