Reading Time: < 1 minute

ఇయ్యాల (ఏప్రిల్ 07) టెన్త్ స్పాట్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసనలు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: గతేడాది ఎస్సెస్సీ స్పాట్ విధులు నిర్వహించిన టీచర్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం అన్ని టెన్త్ స్పాట్ కేంద్రాల వద్ద నిరసన చేయనున్నట్టు టీటీజేఏసీ, యూఎస్​పీసీ, జాక్టో సంఘాల జేఏసీ ప్రకటించింది. ఎస్సెస్సీ స్పాట్ వ్యాల్యుయేషన్, కులగణన విధులకు సంబంధించిన పారితోషికం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ డిమాండ్ చేసింది. 

మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీచర్లంతా ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన కులగణన విధులు పూర్తి చేసి దాదాపు18 నెలలు గడుస్తున్నా నేటికీ దాని పారితోషికం చెల్లించలేదని నేతలు పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.