Reading Time: < 1 minute

ఎంఎంసీలో 12 మంది వర్కర్ల సస్పెన్షన్

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీ పరిధిలో డ్యూటీలకు ఆటంకం కలిగిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న ఔట్​సోర్సింగ్ కార్మికులపై జోనల్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్న 12 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితం జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 10 మంది ఫాగింగ్ (ఎంటమాలజీ) వర్కర్లు, ఇద్దరు యాంటీ లార్వా ఆపరేషన్ చేసే వర్కర్లు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.