Reading Time: 2 minutes

యుద్ధం ఇక భీకరం : రైళ్లను పేల్చేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ : గల్ప్ లో బ్రిడ్జీలు పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరిక

Caption of Image.

మరికొన్ని గంటలు మాత్రమే.. ట్రంప్ డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఏం జరగబోతుంది.. భీకర యుద్ధమేనా.. ఇప్పటి వరకు జరిగింది ఇక ఎత్తు.. ఇక ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు ఉంటుంది.. పరిస్థితులు చూస్తుంటే యుద్ధం ఒక భీకరమే అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఇరాన్ దేశానికి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇరానీయులు ఎవరూ రైళ్లు ఎక్కొద్దు.. రైళ్లల్లో ప్రయాణించొద్దు.. రైల్వే లైన్లకు దూరంగా వెళ్లిపోండి.. ఏ క్షణమైనా రైళ్లపై దాడి జరగొచ్చు.. మీరు బతకాలి అంటే రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి అంటూ ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేసింది ఇజ్రాయెల్. రైళ్లు, రైల్వే లైన్లు.. రైల్వే ఆయిల్ డిపోలు.. రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పని చేసే ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోండి.. ప్రయాణాలు రద్దు చేసుకోండి అని స్పష్టమైన వార్నింగ్స్ విడుదల చేసింది ఇజ్రాయెల్..

ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. సౌదీ అరేబియా, ఖతార్, గల్ప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. గల్ప్ దేశాల్లోని ప్రజలు ఎవరూ జాతీయ రహదారులపై ప్రయాణించొద్దు.. బ్రిడ్జిలపైకి వెళ్లొద్దు.. రోడ్లపైకి రావొద్దు.. బ్రిడ్జిలు అన్నింటిని కూల్చేస్తాం.. విధ్వంసం చేస్తాం అంటూ గల్ఫ్ దేశాల్లోని జానానికి హెచ్చరిక జారీ చేసింది ఇరాన్. 

ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన క్రమంలో.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకున్నది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను కలిపే 25 కిలోమీటర్ల అతి పెద్ద వంతెన (బ్రిడ్జి)ని మూసివేసింది. ఆ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించింది ప్రభుత్వం. సౌదీ అరేబియా, బెహ్రెయిన్ దేశాలను కలిపే ఏకైక వంతెన ఇదే. ఈ 25 కిలోమీటర్ల బ్రిడ్జిని మూసివేయటమే కాకుండా.. చుట్టూ పక్కల అందర్నీ అప్రమత్తం చేసింది సౌదీ అరేబియా. బ్రిడ్జి పరిసరాల్లో ప్రజలు ఎవరూ ఉండొద్దని.. దూరంగా వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇరాన్ దేశంలోని మౌలిక వసతులపై దాడులు చేస్తే.. గల్ప్ దేశాల్లోని బ్రిడ్జిలను కూల్చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చిన తర్వాత.. ట్రంప్ డెడ్ లైన్ గడువు సమీపిస్తున్న క్రమంలో సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకున్నది. 

ఇదే సమయంలో టెహ్రాన్ సిటీలో భారీ పేలుళ్లు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ట్రంప్ డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ గల్ఫ్ దేశాలతోపాటు మిగతా దేశాలు వణికిపోతున్నాయి. యుద్ధం భీకరంగా మారితే.. ఆయిల్ కొరత సంక్షోభానికి దారితీయొచ్చన్న భయాలు ఆయా దేశాలను వెంటాడుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.