Reading Time: 2 minutes
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..

సాధారణంగా మనం పడేసే చిన్న చిన్న సబ్బు ముక్కలతో ఇంట్లోనే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఆ పది అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1. పేపర్ సోప్ తయారీ:

సబ్బు ముక్కలను తురిమి, నీటితో కరిగించి పేస్ట్‌లా చేయాలి. దీనిని ఒక పేపర్‌కు రెండు వైపులా పూసి ఆరబెడితే, ప్రయాణాల్లో వాడుకోవడానికి వీలుగా ఉండే ‘పేపర్ సోప్’ సిద్ధమవుతుంది.

2. క్లీనింగ్ బ్యాగ్:

మిగిలిన సబ్బు ముక్కలను నెట్టెడ్ బ్యాగ్‌లో లేదా పాత సాక్స్‌లో వేసి బేసిన్ దగ్గర ఉంచితే, చేతులు కడుక్కోవడానికి లేదా సింక్ శుభ్రం చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

3. తాళాలు సులువుగా తిరగడానికి:

పాత తాళాలు బిగుతుగా ఉంటే, తాళం చెవికి రెండు వైపులా సబ్బును రుద్ది వాడండి. దీనివల్ల తాళం సులభంగా తెరుచుకుంటుంది.

ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..

4. తలుపుల శబ్దాల నివారణ:

తలుపులు తీసేటప్పుడు వచ్చే కిర్రుమనే శబ్దాలను ఆపడానికి కీళ్ల వద్ద సబ్బును రుద్దాలి. ఇది నూనె కంటే మెరుగ్గా పనిచేస్తుంది. కింద పడి మురికి అవ్వదు.

5. బీరువాలో సువాసన:

బట్టల బీరువాలో మంచి వాసన కోసం సబ్బు ముక్కను టిష్యూ పేపర్‌లో చుట్టి ఉంచండి. ఇది దుర్వాసనను పోగొట్టి బట్టలు తాజాగా ఉండేలా చేస్తుంది.

6. కుట్టుపనిలో సాయం:

జీన్స్ వంటి దళసరి బట్టలు కుట్టేటప్పుడు సూది సులభంగా దిగదు. అప్పుడు సూదిని సబ్బులో రెండు మూడు సార్లు గుచ్చి తీస్తే, అది బట్టలోకి సులువుగా వెళ్తుంది.

7. సూట్‌కేసుల సంరక్షణ:

చలికాలపు బట్టలు లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచే సూట్‌కేసుల్లో సబ్బు ముక్కలను ఉంచడం వల్ల బట్టలు మంచి సువాసనతో ఉంటాయి.

8. జిప్పులు ఫ్రీగా రావడానికి:

హ్యాండ్‌బ్యాగులు లేదా జాకెట్ల జిప్పులు ఆగిపోతే, వాటిపై సబ్బును రుద్దండి. అది లూబ్రికెంట్‌లా పనిచేసి జిప్పు సులభంగా కదిలేలా చేస్తుంది.

9. షూల దుర్వాసన దూరం:

షూల నుంచి వచ్చే చెడు వాసనను పోగొట్టడానికి, చిన్న సబ్బు ముక్కను పల్చటి క్లాత్‌లో చుట్టి రాత్రంతా షూ లోపల ఉంచితే ఉదయానికి మంచి వాసన వస్తుంది.

10. గార్డెనింగ్ చిట్కా:

మొక్కల పని చేసేటప్పుడు గోళ్ళల్లో మట్టి చేరకుండా ఉండాలంటే, ముందుగా గోళ్ళతో సబ్బును గీకాలి. అలాగే ఒక సాక్స్‌లో సబ్బు ముక్కలు వేసి గార్డెన్‌లో వేలాడదీస్తే పని పూర్తయ్యాక చేతులు కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా వ్యర్థంగా పారేసే సబ్బు ముక్కలను తెలివిగా వాడటం వల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా పనులు కూడా సులభమవుతాయి.

ఇది చదవండి: పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..