Reading Time: < 1 minute

స్వర్ణ పోరుకు లలిత్

Caption of Image.

బిష్కెక్‌‌‌‌‌‌‌‌ (కజకిస్తాన్‌): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా రెజ్లర్ లలిత్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరి మెడల్ ఖాయం చేసుకున్నాడు. సోమవారం జరిగిన  మెన్స్ 55 కేజీ గ్రీకో రోమన్ కేటగిరీ సెమీఫైనల్లో లలిత్ 11-–3 తేడాతో  చైనాకు చెందిన హుయింగ్ షిని చిత్తు చేశాడు. 

మంగళవారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇఖ్తియార్ బొటిరోవ్‌‌‌‌‌‌‌‌తో తలపడనున్నాడు. మరోవైపు సునీల్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమన్ కాంస్య పతకాల కోసం పోటీలో ఉన్నారు. 77 కేజీ విభాగంలో అమన్, 87 కేజీల్లో మాజీ చాంపియన్ సునీల్ కుమార్ సెమీ ఫైనల్ బౌట్స్‌‌‌‌‌‌‌‌లో ఓడిపోయి కాంస్య పతక రేసులో నిలిచారు. మరోవైపు సన్నీ కుమార్ (65  కేజీ), జోగిందర్ (130  కేజీ)  క్వార్టర్ ఫైనల్లోనే  ఓడి పతక రేసు నుంచి తప్పుకున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.