Reading Time: < 1 minute
Allu Arjun X Atlee Intensive Pre Look Released Title Announcement Tomorrow At 11 Am

ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు.

Also Read : Successful Lady Producers : నిర్మాతలుగా సక్సెస్ అందుకున్న అక్కాచెల్లెళ్లు

ఇదే విషయాన్ని చెబుతూ ఓ రోజు ముందే ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో ఒక తోడేలును పోలిన జంతువు చేయి కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌ భయంకరంగా కనిపిస్తోంది. ఈ ఇంటెన్సివ్ పోస్టర్ చూస్తుంటే.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది కూడా అంతుబట్టకుండా ఉంది. కానీ, సూపర్ హీరో కథతో అట్లీ ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తు.. లవ్ లెటర్ లోడింగ్ అని రాసుకొచ్చాడు అట్లీ. దీనిని బట్టి చూస్తే, అట్లీ తన మార్క్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో పాటు ఒక అద్భుతమైన ప్రేమకథను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, రేపు ఉదయం 11 గంటలకు విడుదలయ్యే టైటిల్ పోస్టర్ ద్వారా సినిమా కథాంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి రేపు రాబోయే ఆ ‘లవ్ లెటర్’ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!