Reading Time: 2 minutes
Paytm Biometric Upi Payments Cardless Atm Withdrawal Guide

Paytm New Feature: డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న పేటియం తన యూజర్స్ కోసం సరికొత్త, అత్యంత సురక్షితమైన ఫీచర్లను పరిచయం చేసింది. ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే, కేవలం మీ ముఖం లేదా వేలిముద్ర ద్వారా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

READ ALSO: Rakasa: దూసుకుపోతున్న రాకాస.. మూడు రోజుల్లో షాకింగ్ కలెక్షన్స్

సాధారణంగా మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తాం. కానీ కొత్త అప్‌డేట్ ప్రకారం.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్‌ప్రింట్, ఐఫోన్లలో ఫేస్ ఐడి ద్వారా కేవలం సెకన్లలో పేమెంట్ పూర్తి చేయవచ్చు. ఎన్‌పీసీఐ నిబంధనల ప్రకారం.. బయోమెట్రిక్ ద్వారా చేసే ఒక్కో లావాదేవీకి రూ.5,000 వరకు పరిమితి విధించారు. వినియోగదారుల బయోమెట్రిక్ డేటాను పేటియం గానీ, బ్యాంకులు గానీ స్టోర్ చేయవు. ఫోన్‌లోని అంతర్నిర్మిత సెక్యూరిటీ సిస్టమ్ ద్వారానే ఇది పనిచేస్తుంది కాబట్టి ఇది పూర్తిగా సేఫ్. ఇకపై మీరు వాలెట్‌లో డెబిట్ కార్డ్ మర్చిపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇకపై ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను పేటియం యాప్‌తో స్కాన్ చేస్తే మీ ఫోన్‌లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ స్కానర్ ధృవీకరిస్తే చాలు, ఏటీఎం నుంచి నగదు బయటకు వస్తుంది. సాధారణంగా దీనికి ఒక్కో లావాదేవీకి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు (ఇది బ్యాంకు నిబంధనలను బట్టి మారుతుంటుంది).

ఈ ఫీచర్లను ఇలా ఎనేబుల్ చేసేయండి..
బయోమెట్రిక్ పేమెంట్స్ కోసం:
ముందుగా పేటియం యాప్ ఓపెన్ చేసి Profile ఐకాన్‌పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి “Pay with Fingerprint” లేదా “Pay with Face ID” ఆప్షన్‌ను ఎంచుకోండి. అనంతరం మీ బ్యాంకు ఖాతాను ఎంచుకుని బయోమెట్రిక్ పూర్తి చేస్తే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.

ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడానికి..
“UPI Cash Withdrawal” సదుపాయం ఉన్న ఏటీఎంకు వెళ్లండి. అక్కడ స్క్రీన్‌పై “UPI Cash Withdrawal” ఎంచుకుని, కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయండి. తర్వాత స్క్రీన్‌పై వచ్చే QR Codeను పేటియం యాప్‌తో స్కాన్ చేసి, మీ బయోమెట్రిక్ లేదా పిన్ ద్వారా పేమెంట్ కన్ఫర్మ్ చేస్తే డబ్బులు లభిస్తుంది. ఈ కొత్త ఫీచర్లు డిజిటల్ లావాదేవీలను మునుపెన్నడూ లేనంత వేగంగా, సురక్షితంగా మారుస్తాయని పేటియం ధీమా వ్యక్తం చేస్తోంది.

READ ALSO: Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!