Reading Time: < 1 minute
Disappointment For Mega Fans Ram Charans Peddi Release Postponed Here Are The New Dates

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది’. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడిందని వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Also Read : JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!

అయినా సరే పెద్ది రిలీజ్ వాయిదా తప్పేలా లేదు. ఇంకా రెండు సాంగ్స్, కొంత మేర ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండడం, దానికి తోడు ఏ ఆర్ రెహమాన్ ఆర్ ఆర్ కూడా టైమ్ పట్టేలా ఉండడంతో ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా వేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘పెద్ది’ చిత్రాన్ని వేసవి ముగిసిన తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం రెండు తేదీలను మేకర్స్ పరిశీలిస్తున్నారు. వాటిలో జూన్ 04 లేదా జూన్ 25 ఈ రెండింటిలో ఒక తేదీని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.