
వలస కార్మికులకు, చిన్న కుటుంబాలు, బ్యాచిలర్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ఇకపై అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా సులభంగా 5 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ పొందే అవకాశం కల్పించింది. సాధారణంగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే ఆధార్‌తో పాటు లోకల్ అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ కోసం ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది.
వీటిలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడి కార్డు ఇందులో ఏదో ఒకటి ఉంటే చాలు. ప్రభుత్వ గుర్తింపు పొందిన గ్యాస్ ఏజెన్సీలు, కొన్ని సెలెక్ట్ చేసిన పెట్రోల్ బంకుల్లో ఈ చిన్న సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల ఇంధన సరఫరాపై ప్రభావం పడటంతో, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ సిలిండర్ల లభ్యతను భారీగా పెంచింది.
వలస కార్మికులకు ప్రత్యేకంగా
సొంత ఊరు వదిలి వేరే చోట పనిచేసే వలస కార్మికుల కోసం HPCL పెట్రోల్ బంకుల్లో 11 ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ డీలర్ల వివరాలను అందిస్తాయి.
అయితే ఏప్రిల్ 4 ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయి. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు వేల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలోకి, ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
HP Gas appeals to all migrant workers to remain calm and not pay attention to any rumors.
If required, they can visit their nearest HP Gas distributor with a valid ID proof and obtain a 5 kg Appu cylinder.
LPG supply is normal, and adequate arrangements are in place to meet all… pic.twitter.com/h9eGsMeiEC
— Hindustan Petroleum Corporation Limited (@HPCL) April 4, 2026