Reading Time: < 1 minute
Israel Idf Warning Iran Trains Railways Trump Deadline Strikes

Israel: ఇజ్రాయిల్ ఇరాన్‌ను హెచ్చరించింది. ట్రంప్ హర్మోజ్‌ తిరిగి ఓపెన్ చేయాలని విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని గంటల ముందు తాజా హెచ్చరికలు వచ్చాయి. సంఘర్షణ మధ్య రానున్న 12 గంటల వరకు ఇరాన్ ప్రజలు రైళ్లలో ప్రయాణించడం మానుకోవాలని ఇజ్రాయిల్ చెప్పింది. “మీ భద్రత దృష్ట్యా, ఈ క్షణం నుండి ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల) వరకు, మీరు ఇరాన్ అంతటా రైళ్లను ఉపయోగించడం మరియు ప్రయాణించడం మానుకోవాలని మేము దయతో కోరుతున్నాము” అని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ సలహా ఇచ్చింది.

Read Also: NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

పర్షియన్ భాషలో అత్యవసర హెచ్చరికలు జారీచేసింది. రైళ్లకు, రైల్వే ట్రాక్‌లకు దూరంగా ఉండాలని చెప్పింది. మరోవైపు, ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. గడువులోగా ఒక ఒప్పందానికి రాకుంటే, ఇరాన్‌ను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.