
ఇరాన్ సుప్రీం ఖమేనా మొజ్తాబా బతికి ఉన్నారా లేక చనిపోయారా అనే విషయంపై కొత్తగా మరికొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఆయన కండీషన్ చాలా సీరియస్ అని.. జీవచ్ఛవంగా ఉన్నారని.. మాట్లాడలేని పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్నారంటూ అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అది కూడా ట్రంప్ డెడ్ లైన్ కు కొన్ిన గంటల ముందు ఇలాంటి వార్తలు రావటం ఆసక్తిరేపుతోంది.
ఇరాన్ సుప్రీం ఖమేనీ చనిపోయిన తర్వాత.. ఆయన స్థానంలో అతని కుమారుడు ఖమేనీ మొజ్తాబా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసింది. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. అతని పాత వీడియోలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త సుప్రీం మొజ్తాబా చనిపోయారని లేదా బతికి ఉంటే కనిపించాలి కదా అంటూ ట్రంప్ తో సహా ఇజ్రాయెల్ చెబుతూ వస్తుంది. ఎన్ని రకాలుగా వార్తలు వచ్చినా.. కొత్త సుప్రీం మొజ్తాబా విషయంలో ఇరాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ దేశాన్ని నాశనం చేస్తానంటూ.. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటల వరకు డెడ్ లైన్ పెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరికొన్ని గంటల్లోనే ఆ డెడ్ లైన్ గడువు ముగుస్తుంది. ఈ క్రమంలోనే మొజ్తాబా ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు బయటకు రావటం ఆసక్తి రేపుతోంది.
విశ్వసనీయ వర్గాలు అంటూ ప్రచారంలో ఉన్న ఈ వార్తల్లో.. ఇరాన్ లో ఖోమ్ సిటీలోని ఓ రహస్య ప్రదేశంలో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఖమేనీ మొజ్తాబా చికిత్స తీసుకుంటున్నారని.. అతను అపస్మాకర స్థితిలో ఉన్నారని.. మాట్లాడటం లేదని.. జీవచ్ఛవంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఇరాన్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ సమాచారాన్ని గల్ప్ దేశాలకు అమెరికా వెల్లడించినట్లు టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం లేదని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. దీనిపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.