Reading Time: < 1 minute

ఐపీఎల్‌‌కు హసరంగ కష్టమే!

Caption of Image.

కొలంబో: శ్రీలంక స్టార్ లెగ్ స్పిన్నర్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్  వానిందు హసరంగ గాయం కారణంగా ఐపీఎల్  నుంచి తప్పుకునే అవకాశం  కనిపిస్తోంది. ఎడమ కాలి గాయంతో బాధపడుతున్న అతను గత ఫిబ్రవరి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.

 ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీ) పొందాలంటే ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉండగా, హసరంగ ఇప్పటివరకు ఆ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు హాజరు కాలేదు.  రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన కీలక స్పిన్నర్ రాకపై స్పష్టత లేకపోవడంతో లక్నో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రత్యామ్నాయాలపై  దృష్టి సారించింది. హసరంగ స్థానంలో ముజీబ్  రహ్మాన్, మహ్మద్ నబీ, లియామ్ డాసన్‌‌‌‌‌‌‌‌లో ఒకరిని జట్టులోకి
తీసుకునే ఆలోచనలో లక్నో ఫ్రాంచైజీ ఉంది. 

©️ VIL Media Pvt Ltd.