
MLA Arava Sridhar: రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ప్రైవేట్ వీడియోలు, ఫొటోల అంశంపై హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్… టీవీలు, డిజిటల్ సోషల్ మీడియా వేదికల్లో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ కంటెంట్ ప్రసారం అవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ వీడియోలు, ఫొటోలు మరియు సంబంధిత కంటెంట్‌ను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే హర్షవీణ అనే మహిళ అందించిన కంటెంట్‌ను భవిష్యత్తులో మళ్లీ లప్‌లోడ్ చేయకుండా, ప్రసారం చేయకుండా నిరోధించాలని కూడా అభ్యర్థించారు.
Read Also: Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా, అరవ శ్రీధర్ తరఫున న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. పిటిషనర్ గోప్యత హక్కు ఉల్లంఘనకు గురవుతోందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీధర్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను ప్రసారం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రైల్వేకోడూరు పోలీసులను ఆదేశించారు. ఇక, తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..