Reading Time: < 1 minute

సొంతింటి కలను నెరవేరుస్తున్న సర్కార్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Caption of Image.

ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం బండతండా గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. అనంతరం చింతల్ తండాలో జీపీ ఆఫీస్, సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

కమ్మరిపేటలో ఇందిరమ్మ ఇల్లు, సీసీరోడ్డును ప్రారంభించి, దర్గాను పరిశీలించారు. అనంతరం వేలేరు మండల కేంద్రంలో సీసీ రోడ్డు ప్రారంభించారు. రైతు వేదికలో 15 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్​ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు, వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ పై డ్రోన్, బేయిలర్స్, రూటవేటర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను అందజేశారు.  

©️ VIL Media Pvt Ltd.