Reading Time: 2 minutes
Anil Ravipudi: ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా? ఇద్దరూ ఒక సినిమా కూడా చేశారు

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరని చెప్పవచ్చు. ఎందుకంటే ది గ్రేట్ రాజమౌళి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడినే. పటాస్ మొదలుకొని మొన్నటి మన శంకరవర ప్రసాద్ గారు వరకు ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారు సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపపిస్తున్నారు. అయితే అనిల్ మాత్రం మరోసారి తన ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ తోనే జత కట్టాడు. అలాగే తనకు డైరెక్టర్ గా మొదటి ఛాన్స్ఇచ్చిన కల్యాణ్ రామ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి తప్పితే అనిల్ రావిపూడి పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఓ ముద్దుగుమ్మ ఈ డైరెక్టర్ కు కోడలు అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడినే ఓ సందర్భంలో పంచుకున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా?

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భగవంత్ కేసరి. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే బాలయ్య కూతురిగా శ్రీలీల కీలక పాత్రలో మెరిసింది. ఈ సినిమా ప్రమోషన్లలోనే శ్రీలీలతో తనకున్న బంధుత్వాన్ని బయటపెట్టారు అనిల్‌ రావిపూడి. శ్రీలీల తనకు వరసకు అక్క కూతురు అవుతుందని చెప్పుకొచ్చారు. అదెలాగంటే..
శ్రీలీలది సొంత రాష్ట్రం కర్ణాటక. అయితే ఆమె తల్లి డాక్టర్‌ స్వర్ణ సొంతూరు మాత్రం ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సొంతూరు కూడా ఇదే నట. శ్రీలల పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాల్లోనే అయినా.. సెలవుల్లో ఏటా పొంగులూరు వచ్చేదట. చాలా రోజుల పాటు తన అమ్మమ్మ దగ్గరే ఉండేదట. ఇక శ్రీలీల తల్లి అనిల్‌ రావిపూడికి స్వయనా కజిన్‌ సిస్టర్‌ అవుతారట. అంటే శ్రీలీల అనిల్‌కు కోడలు వరుస అన్నమాట.

శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by SREELEELA (@sreeleela14)

కాగా భగవంత్‌ కేసరి షూటింగ్ సెట్‌లో తాము బంధువులమనే విషయాన్ని దాచిపెట్టారట శ్రీలీల, అనిల్ రావిపూడి. అయితే సెట్స్‌లో అందరి ముందూ అనిల్‌ను డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం ‘మామయ్య’ అంటూ ఆట పట్టించేదట.

 

View this post on Instagram

 

A post shared by SREELEELA (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.