Reading Time: < 1 minute
Fake Collection Chaos At Box Office 25 Crores Poster For 3 Crores Reality Makers Get Heavily Trolled

సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ల లెక్కలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అయితే తాజాగా ఒక సినిమా విషయంలో మేకర్స్ విడుదల చేసిన వసూళ్ల పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పాలవుతోంది. గ్రౌండ్ రియాలిటీకి మేకర్స్ చెప్తున్న అంకెలకు పొంతన లేకపోవడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. లేటెస్ట్ గా తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అయిన లెజెండ్ శరవణన్ నటించిన ‘లీడర్’ సినిమా కోలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓవరాల్‌గా వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద రూ. 3 కోట్లు రేంజ్ లోనే గ్రాస్ వసూళ్లను సాధించినట్లు అంచనా. థియేటర్ల ఆక్యుపెన్సీ మరియు టికెట్ రేట్ల లెక్కలు చూస్తే ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది.

Also Read : Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

కానీ చిత్ర యూనిట్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఈ సినిమా వీకెండ్‌లోనే రూ. 25 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. కేవలం రూ. 25 కోట్లతో ఆగకుండా రూ. 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతోందని కూడా మేకర్స్ ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. అసలు రూ. 3 కోట్లు దాటడమే కష్టంగా ఉన్న తరుణంలో, ఏకంగా 100 కోట్ల ప్రస్తావన తీసుకురావడం ‘ట్రోల్ స్టఫ్’ గా మారింది. మేకర్స్ అత్యుత్సాహం ప్రదర్శించి ఇలాంటి “ఫేక్ వసూళ్లు” ప్రకటించడంపై సినిమా విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ పోస్టర్ బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. “మీకు లెక్కలు వచ్చా? లేక కావాలనే ఇలా చేస్తున్నారా?” అని కొందరు, “సినిమా కలెక్షన్ల కంటే మీ గ్రాఫిక్స్ బాగున్నాయి” అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద వసూళ్ల విషయంలో  ఫేక్ పోస్టర్స్ లేకపోవడం ట్రోల్స్ నడుస్తున్నాయి.