వంట గదిలో గిన్నెలు తొమడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్పాంజ్‌లను ఉపయోగిస్తారు. అయితే చాలా మంది వీటిలో ఎలాంటి క్రీమ్స్ ఉండవు అనుకుంటారు. కానీ ఇందులోనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. అందుకే తప్పనిసరిగా వీటిని మార్చాలంట. లేకపోతే బ్యాక్టీరియా గిన్నెలపైకి కూడా వచ్చి, తీసుకునే ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్లి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట.
వంట గదిలో ఉండే స్పాంజ్లు ఉష్ణోగ్రత , తేమ, ఆహారం వంటి కారణాల వలన ఇందులో సూక్ష్మ క్రిములు ఎక్కువగా పేరుకపోతాయంట. అంతే కాకుండా వీటిని మీరు శుభ్రం చేసినప్పటికీ, సరైన సమయంలో మార్చకపోతే హానీకరమైన బ్యాక్టీరియా వాటిలో పేరుకపోతుందంట.
సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వంటగది స్పాంజ్లు సూక్ష్మజీవులకు ఒక హాట్ స్పాట్‌గా పని చేస్తుందంట. పాత్రలు కడిగే సమయంలో బ్యాక్టీరియా పెరిగి అవి తీసుకునే ఆహారంలోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా కోలి, సాల్మొనెల్లా , స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియా స్పాంజ్‌లపై దాదాపు 16 రోజుల వరు జీవించి ఉంటాయంట.
అందుకే తప్పకుండా మీరు వంట గిన్నెలు శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజ్‌లను కనీసం వారం లేదా రెండు వారాలకు ఒకసారి మార్చడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొంత మంది మేము వంట గిన్నెలు శుభ్రం చేసిన తర్వాత వాటిని క్లీన్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ వాటిని శుభ్రపరిచినా అందులో నుంచి బ్యాక్టీరియా వెళ్లిపోదంట. అందువలన తప్పకుండా వాటిని మార్చడమే ఆరోగ్యానికి చాలా మంచిది.
మీరు వారం లేదా రెండు వారాలకు ఒకసారి గిన్నెలు శుభ్రం చేసే స్పాంజ్ మార్చకపోతే దానిలోని బ్యాక్టీరియా మీరు ఆహారం తీసుకునే స్పూన్స్, ప్లేట్స్, ఆహారంలోకి వ్యాపించి, శరీరంలోకి వెళ్తుంది. దీంతో విరేచనాలు,వాంతులు వంటి అనేక సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. అందుకే తప్పనిసరిగా స్పాంజ్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట.




