Reading Time: < 1 minute

నెక్నంపూర్ ఎస్టీపీ పనులు మొదలు పెట్టండి : వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

Caption of Image.
  • వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: అమృత్-2.0 పథకంలో భాగంగా నెక్నంపూర్ ఇబ్రహీం చెరువు వద్ద నిర్మించనున్న కొత్త సీవరేజీ ట్రీట్​మెంట్ ప్లాంట్​(ఎస్టీపీ) పనులను వెంటనే ప్రారంభించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్టీపీ నిర్మాణ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మల్కం చెరువు నుంచి వచ్చే మురుగునీటిని మళ్లించి, శుద్ధి చేసిన తర్వాతే ఇబ్రహీం చెరువులోకి వదిలేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 

మణికొండ, ల్యాంకో హిల్స్, పుప్పాలగూడ తదితర ప్రాంతాల డ్రైనేజీ లైన్లను ఈ ఎస్టీపీకి అనుసంధానించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని, అలాగే ఓఆర్ఆర్ వెంట శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు పైప్​లైన్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ నిర్మించే బాక్స్ డ్రైన్ల వెంట ట్రంక్ సీవర్ మెయిన్ లైన్లను కూడా ప్లాన్ చేయాలని, సాయిల్ టెస్టింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ప్రాజెక్టు సీజీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.