
నాంపల్లి: హైదరాబాద్ లోని నాంపల్లిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. కవాడిగూడలో శ్రావణి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గాంధీ నగర్ పోలీసులు తనని వేధిస్తున్నారని కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకొని పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు.సదరు మహిళను కమిషన్ చైర్మన్ వద్దకు హెచ్ ఆర్ సి సిబ్బంది తీసుకెళ్లారు.