
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) రెసిడెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమై, ఏప్రిల్ 27న ముగుస్తుంది.
పోస్ట్ పేరు: రెసిడెంట్ ఇంజినీర్.
మొత్తం ఖాళీలు: 05.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఫుల్‌టైమ్ డిప్లొమా / డిగ్రీ కలిగి ఉండాలి. నిర్మాణ/ ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్టులో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 02.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష
రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. 150 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. ఇందులో కనీస అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rites.com ను సందర్శించండి.