
బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ మూవీ పై పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాపై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మ ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చూసిన అనంతరం విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు.
ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..
“భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవాన్ని నేను ఎప్పుడూ పొందలేదు. దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ, ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, భావోద్వేగంతో సాగింది. సినిమా చూస్తున్నంత సేపు నేను కనీసం కనురెప్ప కూడా వేయలేదు” అని కోహ్లీ పేర్కొన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతమైన ప్రతిభను, రణ్‌వీర్ సింగ్ నటనను ఆయన కొనియాడారు. రణ్‌వీర్ ఈ చిత్రంతో సరికొత్త శిఖరాలను చేరుకున్నారని, ఆయన నటనకు ‘అద్భుతం’ అనే పదం కూడా తక్కువేనని ప్రశంసించారు. అనుష్క శర్మ కూడా ఈ సినిమా తనను ఎంతగానో కట్టిపడేసిందని పోస్ట్ చేశారు.
ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కోహ్లీ దంపతుల ప్రశంసలపై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “విరాట్.. నీ ప్రశంసలు నాకు ఎంతో విలువైనవి. నిజానికి నేను నీకు పెద్ద అభిమానిని. మైదానంలో నువ్వు చూపే పోరాట పటిమ మా అందరికీ ఒక స్ఫూర్తి. దేశం గర్వపడేలా నువ్వు ఆడుతుంటావు, నా సినిమాల ద్వారా నేను కూడా అదే ప్రయత్నం చేస్తాను. అనుష్క నుంచి అభినందనలు అందడం నా బాధ్యతను మరింత పెంచింది” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ధురంధర్ 2’ మేనియా బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..
ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..