
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తామని ఆ పార్టీ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం పుదుచ్చేరిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల భృతి ఇస్తామని, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ లో 30 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
అలాగే, ప్రభుత్వ ఉద్యోగా లకు వయో పరిమితిని 40 ఏండ్లకు పెంచుతామని, ప్రతీ కుటుంబానికి రూ.20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. ‘‘ సర్జరీ అయినా, ట్రీట్ మెంట్, గుండెజబ్బులు, క్యాన్సర్ ఇలా ఏ ప్రాణాంతక వ్యాధి అయినా రూ.20 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాం” అని రాహుల్ పేర్కొన్నారు.