
మృత్యువుతో పోరాడుతున్న ఒక రోగికి ఊపిరితిత్తుల మార్పిడి అత్యవసరమైంది. దీని కోసం దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను విమాన మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి సుమారు 30 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా దాటాల్సి ఉంది. సాధారణంగా ఈ రూట్‌లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా అవయవం నిరుపయోగమయ్యే ప్రమాదం ఉండటంతో, ఆసుపత్రి వర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. వెంటనే స్పందించిన సైబరాబాద్ మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ప్రకటించారు.
ఎయిర్‌పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు ఉన్న అన్ని సిగ్నల్స్‌ను క్లియర్ చేశారు.అంబులెన్స్ ప్రయాణించే దారిలో ఎక్కడా వాహనాలు అడ్డురాకుండా ప్రత్యేక బృందాలను మోహరించారు. కిలోమీటర్ల దూరాన్ని కేవలం కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ దాటేలా చేసి, సకాలంలో ఆసుపత్రికి చేర్చారు.సకాలంలో ఊపిరితిత్తులు అందడంతో వైద్యులు వెంటనే శస్త్రచికిత్స ప్రారంభించారు. ప్రాణదాత అవయవాలను క్షేమంగా చేర్చడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు బాధితుడి కుటుంబ సభ్యులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.